అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తా

ఆంధ్రప్రదేశ్ కావలి

SSV NEWS REPORTER :  K Ramu(Gudluru):

కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి వెల్లడించారు . కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ప్రతాపకుమార్ రెడ్డి మాట్లాడుతూ – నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు . నియోజకవర్గంలో రైతాంగం సాగునీటికి ఇబ్బంది పడకుండా తగు చర్యలు గైకొంటున్నట్లు తెలిపారు . తనను నమ్మి రెండోసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై వుందన్నారు . నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ , ఫిషింగ్ హార్బర్ , ఎయిర్ పోర్టు ఏర్పాటైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు . అన్ని గ్రామాల్లో రోడ్లు , డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుందన్నారు . తుమ్మలపెంట రోడ్డు త్వరలో రెండులైన్ల రోడ్డు గా ఆవిర్భవించబోతుందని , ఈ రోడ్డుకు సంబంధించిన టెండర్లు కూడా ప్రభుత్వం రెండురోజుల్లో ఖరారు చేస్తుందని , ఆరు మాసాల్లో ఈ రోడ్డు పూర్తి అవుతుందని పేర్కొన్నారు . ఈ రోడ్డును ఇటు ఫిషింగ్ హార్బర్ వరకు అనుసంధానం చేస్తామని , అలాగే చెన్నాయిపాలెం మీదుగా రుద్రకోటలో కలిసే విధంగా రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు . తుమ్మలపెంట విషయానికొస్తే – ఈ గ్రామ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న నానుడిని గుర్తుకు తెస్తుందన్నారు . మత్స్య కారులు అధికంగా జీవిస్తున్న చెన్నాయిపాలెం , అన్నగారిపాలెం , తుమ్మలపెంట , ఇస్కపల్లి తదితర పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు . ఈ పంచాయతీల అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల మన్ననల్ని పొందితీరుతామన్నారు .

 

కావలి ఆర్డీఓ దాసు , ఆబ్కాబ్ చైర్మన్ కొండూరి అనీల్ బాబు , కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి తదితరులు కూడా ప్రసంగించారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని మహిళలు వేసిన కోలాటం అందరినీ అలరించింది .  కావలి నియోజకవర్గ పరిధిలో బుధవారం జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి భారీగా విచ్చేసిన మహిళలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *