YSR‌ చేయూతతో ఆర్థికాభివృద్ధి

అనంతపురం ఆంధ్రప్రదేశ్

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU

-వైకెపి ఆర్థిక సహాయం ద్వారా ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని ప్రారంభించిన వై. విశ్వేశ్వరరెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు, ఆర్థికంగా స్వావలంబన పొందేందుకు వైఎస్సార్‌ చేయూత పథకం ఎంతో మేలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీలో వైస్సార్ చేయూత ద్వారా లబ్ది పొందిన బోయ లలితమ్మకు స్త్రీ నిధి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన హనుమాన్ జనరల్ ఫ్యాన్సీ స్టార్ ను విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు స్థిరమైన ఆదాయమార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వైఎస్‌ జగన్, వైయస్సార్‌ చేయూత పథకాన్ని వర్తింప చేస్తామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చడన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నతి కో ఆర్డినేటర్ వీరాస్వామి, వైకెపి సిబ్బంది, వైస్సార్సీపీ చంద్రమ్మ, కరూర్ వెంకటేష్, లత్తవరం గోవిందు, నిరంజన్ గౌడ్,ఈడిగా ప్రసాద్, జోగి వెంకటేష్, వన్నప్ప, రాజశేఖర్,శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *