అసెంబ్లీలో నేతన్నల గొంతు

తెలంగాణ

అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..

రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు.
– వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
– ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది కోసం మంత్రి కేటీఆర్  ఉదార స్వభావంతో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ జీవనోపాది కలిగిస్తున్నారు.
– వాటిని తయారు చేసే వారు 50-60 సంవత్సరాల వయస్సు కార్మికులు ఉండటం వల్ల కొత్తగా వచ్చే పవర్ లూమ్స్ తో వారు వాటిని తయారు చేయలేకపోతున్నారు.కాబట్టి వారు కార్పేట్స్ మరియు దుప్పట్లు నేసినంత కాలం వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కే.టీ.ఆర్ ని కోరుతున్నామని ఎమ్మెల్యే అసెంబ్లీలో చేనేతల గొంతును వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *