పోలీస్ సిబ్బంది విధినిర్వహణలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

SSV NEWS REPORTER : తణుకు రామచంద్ర రావు

పోలీస్ సిబ్బంది అధికారులు విధి నిర్వహణలో వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్ తెలిపారు.మంగళవారం గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో సిఐలు ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులను అనుగుణంగా పోలీసుల్లో మార్పు రావాలని అందుకు ప్రతి పోలీసు లో మార్పు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పోలీసు వ్యవస్థలో మానసిక పరివర్తన జరగాలని సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలను గౌరవించాలని ఆయన అన్నారు .రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల మంది పోలీసులు సిబ్బందిలో లో ఏ ఒక్కరూ పొరపాటు చేసినా మొత్తం వ్యవస్థనే తప్పు పట్టే విధంగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయన్నారు.

ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఫ్రెండ్లీ పోలీస్ మెలగాలని దిశానిర్దేశం చేశారు .అదేవిధంగా పోలీసుల ప్రవర్తన తీరుపై లీగల్ అడ్వైజర్ భద్ర రావు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అతి ముఖ్యమైనది విధి నిర్వహణలో సక్రమంగా జరగాలని ఆయన తెలిపారు .మహిళా చట్టాల పై శ్రీవల్లి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళల పై జరుగుతున్న అరాచకాలు ఎక్కువగా ఉన్నాయని వాటి నిర్మూలనకు పోలీసు వ్యవస్థ పూర్తిస్థాయిలో విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అవినీతి నిర్మూలన పోలీసు వ్యవస్థ మార్పులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఎస్.పి ఎన్ బాబ్జి ,సివిల్ రైట్ బై ,శ్రీనివాస్ జగ్గంపేట సీఐ, సురేష్ బాబు తుని టౌన్ సిఐ ,రమేష్ గండేపల్లి ఎస్సై, శోభన కుమార్ రంగంపేట ,ఎస్ఐ సిహెచ్ సుధాకర్ జగ్గంపేట, ఎస్ ఐ టి రామకృష్ణ, పెద్దాపురం ఎస్సై ,బాలాజీ జీ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్సైలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా ఇంచార్జ్ ప్రసాద్ బాబు కొప్పినీడి (రాజమౌళి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *