అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలంటూ CPM నిరసన

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

SSV NEWS,RAJAVOMMANGI :  PVS APPARAO

రాజవొమ్మంగి, ఢిల్లీ అల్లర్ల కేసులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి తో సహా పలువురు మేధావులు పై బనాయించిన అక్రమ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో రాజవొమ్మంగి లో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజవొమ్మంగి గ్రామంలో ర్యాలీ నిర్వహించి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు తెడ్ల అబ్బాయి,సింగిరెడ్డి అచ్చారావులు మాట్లాడుతూ, ఢిల్లీ అల్లర్లకు కారకులైన అసలు వ్యక్తులు పట్టుకోవడం మానివేసి సిపిఎం అఖిలభారత కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి పై అలాగే దేశం గర్వించదగ్గ మేధావులైన జయతి ఘోష్,యోగేంద్ర యాదవ్ తదితరులు పై తప్పుడు కేసులు పెట్టారని ఇది చాలా దుర్మార్గం అన్నారు.నాయకులపై బిజెపి ప్రభుత్వం ఒత్తిడితో ఢిల్లీ పోలీసులు పెట్టిన అక్రమ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పై దాడిని దేశ ప్రజలంతా ఖండించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి .బాబురావు,కె జగన్నాథం,టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Koppineedi Prasad Babu Dist.Incharge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *