ఒక్క పోలీస్ కూడా తప్పు చేయకూడదు

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

చిత్తూరు : SSV NEWS 

ఒక్క పోలీస్ తప్పు చేస్తే వ్యవస్థ మొత్తానికే మచ్చ ఏర్పడుతుంది.
మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి.

అగంళ్ళ సమీపంలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో మదనపల్లె డివిజన్ స్దాయి పోలీసుల సింహావలోకనం పేరిట వర్కషాప్ నిర్వహించారు. మదనపల్లె డిఎస్పీ రవిమనోహరచారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బంది హాజరైనారు. ‌ ఈ కార్యక్రమానికి తిరుపతికి చెందిన ప్రముఖ సైకాలజీస్టు సుధాకర్ రెడ్డి, మదనపల్లె బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విష్ణు ప్రియా హాజరై తమ విలువైన సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవిమనోహరచారి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులలో మార్పులు రావాలని అందుకు ప్రతి పోలీసులో మార్పు రావాలని కోరారు. పోలీస్ వ్యవస్ధలో మానసిక పరివర్తన జరగాలని, సమస్యలతో పోలీసు స్టేషనుకు వచ్చే ప్రజలను గౌరవించాలని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది పోలీసు సిబ్బందిలో ఏ ఒక్కరూ పొరపాటు చేసిన మొత్తం సిబ్బందికి అట్డగట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. వివిధ సమస్యలపై పోలీసు స్టేషనుకు వచ్చే ప్రజలను గౌరవించేలా, నేరస్థులు భయపడేలా పోలీసుల పనితీరు ఉండాలని అన్నారు. ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పడతారని చెప్పారు. అవినీతీ నిర్మూలన, పోలీస్ ప్రవర్తనలో మార్పులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

సైకాలజీస్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు, పరివర్తన, సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ ఆలోచనతో పని చేయాలని, రాష్ట్రంలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొందరు సోషియల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిందని అన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారాలని, ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరమని, మార్పు కోసం మీరు కూడా మారాలని హితబోధ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐలు రాజేంద్రనాధ్ యాదవ్, శ్రీనివాసులు, ఆశోక్ కుమార్, మురళీకృష్ణ, శివ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *