ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU

ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య… 15 సెప్టెంబర్ ఆయన జయంతి. ఆయన భారతరత్నగా అందరికీ తెలుసు. ఇంజనీర్ల పితామహుడు అని కీర్తిస్తుంటారు. విశ్వేశ్వరయ్య గురించి భారతదేశమంతా తెలుసుకోవడం వేరు. ఆయన గురించి తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది వేరు. ఎందుకంటే… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు… తరతరాలకు గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగునేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని ఇంజనీర్లకు గొప్ప పాఠాలు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ ఆయన.

సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య… సర్ ఎంవీగా పిలుస్తుంటారు. 1861 సెప్టెంబర్ 15న అప్పటి మైసూర్ సామ్రాజ్యంలోని చిక్కబళ్లపురలోని ముద్దెనహళ్లిలో జన్మించారాయన. ఇప్పుడా ప్రాంతం కర్నాటకలో ఉంది. విశ్వేశ్వరయ్య తండ్రి స్కూల్ టీచర్. కానీ 12 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు విశ్వేశ్వరయ్య. ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే బెంగళూరులో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. 1881లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అంటే ఇప్పుడు కనీస అర్హతగా మారిపోయింది కానీ… ఆరోజుల్లో డిగ్రీ చదవడమంటే అదో గొప్ప.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *