NTR అభిమానుల సేవా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సూళ్లూరుపేట

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు దొరవారి సత్రం (మం) మినముల మూడి లో / పెద్ద సంఖ్య లో పాల్గొన్న మినముల మూడి , చందనముడి , పల్లె ప్రాంతాల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ..

నెల్లూరు జిల్లా లోని స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజకవర్గం లో స్వర్గియ హరికృష్ణ కుమారుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యం సభ్యులు ప్రతి నెలా జరిగే సేవా కార్యక్రమాల్లో భాగం గా సెప్టెంబర్ నెల కు గానూ దొరవారిసత్రం మండలం లోని మినముల మూడి గ్రామం లో లాక్ డౌన్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద లకు బియ్యం , నిత్యవసర సరుకులు , గుడ్లు కూరగాయలు ,అంద జేయడం జరిగింది .

ముఖ్యం గా ఈ కార్యక్రమం లో సూళ్లూరుపేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు కేశవ చంద్రశేఖర్ , సూళ్లూరుపేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు కావలి హరికృష్ణ , దొరవారిసత్రం మండలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు అంబు రాజేష్ , తడ మండలం అధ్యక్షులు హనుమంతు మన స్వామి , సూళ్లూరుపేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ బాల , సెక్రటరీ అజీం , కాదులూరు ప్రెసిడెంట్ బాల , సుందరపురం ప్రెసిడెంట్ శంకర్ , ఉలసా పడవ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సుబ్బు , మరియు మినముల మూడి , చందనముడి , పల్లె ప్రాంతాల నందమూరి అభిమానులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *