జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సూళ్లూరుపేట

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU

“వైఎస్సాఆర్ ఆసరా పథకం” మహిళ లకు ఆర్థిక బాసట గా నిలుస్తుంది అంటున్న సంపతి నరేంద్ర / తిరుమల పూడి లో శ్రీ వై యస్ . జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా అక్క చెల్లమ్మలు …

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం తిరుమల పూడి గ్రామం లో “వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాలు” లో భాగం గా ఆదివారం రచ్చబండ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపతి నరేంద్ర ఆధ్వర్యం లో డ్వాక్రా అక్క చెల్లమ్మలు వై.యస్.ఆర్ ఆసరా అందిన శుభ సందర్భం గా ఈ కార్యక్రమం లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వారి చేతులు మీదు గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచరంగుల వర్ణ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు . అనంతరం ఈ సందర్భం గా , నరేంద్ర మాట్లాడుతూ డ్వాక్రా మహిళ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ . జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వై.యస్.ఆర్ ఆసరా పథకం ఆర్థిక బాసట గా నిలుస్తుందని అన్నారు . ప్రజా సంకల్ప యాత్ర లో ప్రజల కిచ్చిన ఇచ్చిన హామీలన్నింటిని వరుసగా అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వై.యస్ ఆర్ ఆసరా పధకం ద్వారా మరో అడుగు ముందుకు వేశారని అన్నారు .

ఇప్పటి వరకు ఏ రాష్ట్రం లోను అమలు కానీ సంక్షేమ పథకాలు ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో అమలు కావడం మనందరం గర్వించ దగ్గ విషయమని కూడా అన్నారు . తండ్రి కి తగ్గ పాలన ను తనయుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందివ్వడం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వ జన్మ సుకృతమని అన్నారు .

ఈ కార్యక్రమం లో ఆవుల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *