మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సూళ్లూరుపేట

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU

“మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం” అంటున్న సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య 

మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మాది అని అంటున్నారు సూళ్లూరుపేట నియోజక వర్గం శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య . వివరాల్లో కెళితే రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించు కోవాలి మాట చెప్పాడా తప్పక చేసి చూపుతాడు అదే జగనన్న ప్రభుత్వం అంటూ సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య పేర్కొన్నారు . స్థానిక “శ్రీ శక్తి భవన్” లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా పథకం శుక్రవారం నాడు ఎమ్యెల్యే సంజీవయ్య ప్రారంభించారు . ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం కమిషనర్ ఎన్ . నరేంద్ర కుమార్ అధ్యక్షత న మెప్మా మహిళ ల ఆధ్వర్యం లో జంబో చెక్కు ను అంద జేశారు . ఈ సందర్భం గా ఎమ్యెల్యే సంజీవయ్య మాట్లాడుతూ అక్క చెల్లెమ్మ ల గుండెల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు వైయస్సార్ ఆసరా పథకం కింద సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు . ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరుపాళ్లు నెర వేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్విరామం గా కృషి చేస్తున్నారని కొని యాడారు . రాష్ట్ర చరిత్ర లో ఎప్పుడు ఎన్నడు కనివిని ఎరుగని పలు సంక్షేమ పథకాలతో బడుగు , జగన్ మోహన్ రెడ్డి బలహీన వర్గాల ప్రజలకు మరింత చేరువ అయ్యారని ప్రజల గుండెల్లో శాశ్వతం గా జగనన్న నిలిచిపోతారు అంటూ ఆయన తన ప్రసంగం లో వెల్లడించారు .

ఈ కార్యక్రమం లో పట్టణ వైసిపి అధ్యక్షులు కళ్ళ తూరు శేఖర్ రెడ్డి , మండల వైసీపీ అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి , పట్టణ వైసిపి నాయకులు , కార్యకర్తలు తో పాటు శ్రీమంత్ రెడ్డి , మెప్మా మహిళలు విజయలక్ష్మి , వసుంధర తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *