హిందూమతం పై జరుగుతున్న దాడులను ఖండించండి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

నెల్లూరు : SSV NEWS 

రాష్ట్ర బి.జె.పి. పార్టీ పిలుపు మేరకు నిరసన దీక్ష

ఈరోజు హిందూ మతంపై దాడిచేస్తున్న వారిని శిక్షించకుండా మతి స్థిమితం లేనివారిగా చిత్రీకరిచటం.తేనెతుట్టెలు పట్టే యత్నం జరిగి అలా రథం కాలి పోయింది అని చెప్పటం సరైన సమాధానం కాదు.గతంలో బిట్రగుంట వెంకటేశ్వర స్వామి రథం. పిఠాపురం విగ్రహాలు ధ్వంసం ఆపై గుడులలో సిలువ బొమ్మలు వేయటం మరలా ఇప్పుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధంపై భాజపా నిరసన దీక్ష చేపట్టిన కుంచె శ్రీనివాసులు యాదవ్ 2019 తర్వాత ప్రభుత్వ అండతో హిందూ మతంపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. మాత మార్పిడులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్ల దేవాలయ ఆస్తులపై దాడులు సాగుతున్నాయి. అంతర్వేది ఘటనను అందరూ ఖండించాల్సిందే. ఇంతకుముందు జరిగిన ఎన్నో ఘటనల్లో కఠిన చర్యలు తీసుకుంటే అంతర్వేది ఘటన జరిగి ఉండేది కాదు. నిందితులకు మతిస్థిమితం లేదంటూ నేరగాళ్లను వెనకేసుకొస్తున్నారు, మతి స్థిమితం లేని దాడులు కావవి… దేవాలయాలపై వ్యవస్థీకృతంగా దాడులు సాగుతున్నాయి. నష్టపర్చిన

దేవాలయాలను ప్రభుత్వ ఖర్చుతో పునరుద్ధరించాలి. అంతర్వేది ఘటనలో నిందితులను ఎందుకు పట్టుకోలేదు..? అధికారులపై చర్యలు తీసుకున్నామంటూ చేతులు దులుపుకుంటే సరిపోదు అంతర్వేది
ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలి. భాజపా నేతలను అరెస్టు చేయడం మాని పోలీసులు రథాన్ని కాల్చినవారిని పట్టుకోవాలి. పోలీసులు తల్చుకుంటే నేరస్థులను పట్టుకోవడం కష్టమేమీ కాదు నిందితులను పట్టుకునేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *