నాయుడుపేట లో “సంపూర్ణ పోషణ పథకం” లో నాశిరకం ఖర్జూరం పంపిణీ

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సూళ్లూరుపేట

సూళ్లూరు పేట : SSV ప్రతినిధి : PRAKASH BABU

నాయుడుపేట లో “సంపూర్ణ పోషణ పథకం” లో నాశిరకం ఖర్జూరం పంపిణీ . పట్టించుకోని సంబంధిత అది కారులు …

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని నాయుడుపేట లో గర్భవతులు బాలింతలు , పసిబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలన్న ధ్యేయం తో నేటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “సంపూర్ణ పోషణ పథకం” కొందరు స్వార్ధపరుల కారణం గా ప్రభుత్వ ధ్యేయం నీరు గారి పోతుందని పలువురు తమ ఆవేదన ను వ్యక్తం చేస్తున్నారు . ముఖ్యం గా జిల్లా వ్యాప్తం గా ప్రతి నెలా మొదటి వారం లో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులకు , బాలింతలకు , పసి పిల్లల కు అర కిలో వేరుశనగ చెక్కలు , అర కిలో బెల్లం , అరకిలో ఎండు ఖర్జూరం , అలాగే రెండు కిలోల మల్టీ గ్రైన్ ఆటా ను పంపిణీ చేయాల్సి ఉంది .కాగా కొందరు కొలత లు పాటించక పోగా నాసిరకం పదార్ధాల ను తూతూ మంత్రం గా వారికి పంపిణీ చేసి చేతులు దులుపు కుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి నాయుడుపేట పట్టణం లో . ముఖ్యం గా ఎండు ఖర్జూరం రాళ్ళ కంటే గట్టి గా ఉంటున్నాయి . ఇవి వేరెవరినైనా పగా ప్రతీకారం తో తల పై కొట్టి గాయపరచడానికి తప్పతినడానికి పనికి రావడం లేదని అలాగే మరికొన్ని ఖర్జూరం లు పురుగులు పట్టి దుర్వాస కొడుతున్నాయని మహిళలు తమ ఆవేదన ను వ్యక్తం చేస్తున్నారు . ముఖ్యమంత్రి వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి స్వయం గా ప్రారంభించిన సంపూర్ణ పోషణ పథకాన్ని కొందరు అవినీతి పరులు , అక్రమార్జన కు అలవాటు పడ్డ వారు తమ చేతి వాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి . జిల్లా అధికారులు “సంపూర్ణ పోషణ పథకం” లో జరుగు తున్న అవినీతి అక్రమాల పై తగు చర్యలు తీసుకుని ఈ పధకం సజావు గా కొనసాగించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *