వీధి వ్యాపారులకు రుణాలు వేగవంతంగా అందించాలి: బల్దియా కమీషనర్ పమేలా సత్పతి

తెలంగాణ

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU

వారంలోగా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాలి

 అధికారులు,మెప్మా సిబ్బంది తో సమావేశం…

జిడబ్ల్యూఎంసి, 7 సెప్టెంబర్, 2020:

వీధి వ్యాపారులకు రుణాలు అందించే ప్రక్రియ ను మరింత వేగవంతం చేయాలని బల్దియా కమీషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రదాన కార్యాలయం లో మెప్మా సిబ్బంది తో జరిగిన సమావేశానికి కమిషనర్ హాజరై ప్రధాన మంత్రి ఆత్మ నిర్బర్ పథకం కింద వీధి వ్యాపారులకు అందించే 10 వేల రుణ పురోగతిని సమీక్షించి శీఘ్రంగా చేయుటకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ఈ పథక లక్ష్య సాధనలో నగరం వెనుకంజలో ఉండడం పై అగ్రహం వ్యక్తం చేస్తూ మెప్మా సిబ్బంది అలసత్వాన్ని విడి నిబద్దతతో ప్రధాన మంత్రి ఆత్మ నిర్బర్ పథకంలో గుర్తించిన వీధి వ్యాపారులకు రూ.10 వేల ఋణ మంజూరు వేగవంతం చేసి నిర్ధిష్ట లక్ష్యాన్ని వారంలోగా సాధించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా సమీక్షిస్తున్న దృష్ట్యా ఇట్టి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. సిబ్బందితో షిఫ్ట్ ల వారీగా ఆన్లైన్ నమోదు ప్రక్రియ త్వరితంగా జరగాలని, అందుకు అదనంగా మరో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికంగా నమోదు ప్రక్రియ పోర్టల్ లో నిదానంగా జరుగుతున్నదని దృష్టికి రాగా,ఉదయం, సాయంత్రం సమయాల్లో ఋణ సంబంధిత పత్రాలను పోర్టల్ లో నమోదు చేయాలన్నారు.. ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుటకు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, బల్దియా సెక్రెటరీ నిత్యం పర్యవేక్షించాలని కోరారు. ప్రతిరోజు నమోదు, మంజూరు వివరాలు వాట్స్ అప్ లో నివేదించాలని అన్నారు. చిరు వ్యాపారుల గ్రూప్ ల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికనుగుణంగా అర్హులను గుర్తించాలని, అందుకు ఆర్ పి లు చిత్తశుద్ధితో పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వరంగల్ నగరంలో 28 వేల వీధి వ్యాపారుల గుర్తింపు లక్ష్యం కాగా ఇప్పటివరకు 17,447 మందిని గుర్తించి గుర్తింపు కార్డులు, వెండింగ్ ధ్రువ పత్రాలు అంద జేయడం జరిగిందని అన్నారు. అందులో 8690 మంది వివరాలు ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు కాగా 8757 చేయాల్సి ఉందని చెప్పారు. 1728 మందికి బ్యాంక్ ల ద్వారా ఋణం
మంజూరైనట్లు తెలిపారు. వివిధ బ్యాంక్ లలో పెండింగులో ఉన్న 6962 మందికి తక్షణం రుణం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రుణాలు అందించుటలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

ఈ సమీక్ష లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, టౌన్ ప్రాజెక్ట్ అధికారిని విజయలక్ష్మి, ఏ.డి.ఎం.సి. సతీష్, టి.ఎం.సి.రమేష్, , సి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *