సీనియర్ జర్నలిస్ట్  జి . సత్యం రెడ్డి మృతి కి సంతాపం తెలియజేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు  సూళ్లూరుపేట లో

ఆంధ్రప్రదేశ్ సూళ్లూరుపేట

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU

స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణం  లో పాత్రికేయ వృత్తి లో తనదైన శైలి లో  వార్తా కథనాలతో ప్రజల  పక్షపాతి గా గుర్తింపెరిగిన సీనియర్ పాత్రికేయుడు  గుండాల సత్యనారాయణ రెడ్డి  (52)  గత కొంతకాలం గా అనారోగ్యం తో బాధ పడుతూ నేటి ఉదయం పది న్నర గంటల ప్రాంతం లో ఊపిరి పీల్చు కోవడం లో కొంత అపశృతి ఏర్పడటం తో  ఆయన స్వగృహం లో గురువారం కన్నుమూశారు .  వీరు అనారోగ్యానికి గురి కాక మునుపు ఉదయం , ఈనాడు , వార్త , సూర్య వంటి  ప్రముఖ దిన పత్రిక లలో సుదీర్ఘ కాలం గా విలేఖరి గా  పని చేశారు . ఇటీవల కాలం లో కొంత అనారోగ్యానికి గురై జర్నలిజానికి కాసింత దూరం గా ఉంటూ ఆరోగ్య్యాన్ని సరి చూసుకుంటూ కలం గడుపు తుండగా నేడు సత్యం  రెడ్డి అకాల  మృతి కి గురికావడం పలువురు జర్నలిస్ట్ లు జీర్ణించుకోలేక పోతున్నారు .   వీరు గతం లో రాజీ అనే  కలం పేరు తో పలు వార పత్రికల్లో అనేక కధలు , కవితలు రాసి మంచి కవి గా మనసున్న మనిషి గా మంచివాడు గా పలువురి మన్నన లను పొందినాదనడం లో అతి సయోక్తి లేదేమో .  సత్యం రెడ్డి  1990 సంవత్సరం లో ఓ మంచి జర్నలిస్ట్ గా  గుర్తింపు తెచ్చుకున్నారు . అంతే కాకుండా తడ మండల పరిధి లోని పారిశ్రామిక కేంద్రమైన శ్రీసిటీ లో  ” ప్రో ” గా  అలాగే తడ , వరదయ్యపాలెం , సత్యవేడు , సూళ్లూరుపేట పాత్రికేయులకి అందుబాటు లోవుండి అందరి అభిమానం చూర గొన్నారు.  ఆయన కి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు .సూళ్లూరుపేట  నియోజక వర్గ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా  జర్నలిస్టులు  సత్యం రెడ్డి అకాల మరణానికి  చింతిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలియ జేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *