కండ్రపు రాజారెడ్డి కి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ అభినందలు

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

SSV NEWS: PRASAD BABU KOPPINEEDI INCHARGE, EG.DT.,

రాజ మహేంద్రవరం, ఆగస్ట్ 6
రెడ్డి జేఏసీ ఆంధ్ర ప్రదేశ్ క్రీడా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా SUPER 60 MP TEAM సోషల్ మీడియా ఆబ్సెర్వెర్ కండ్రపు రాజారెడ్డి నియమితులు కావడంపై రాజ మహేంద్ర వరం ఎంపీ, వైఎస్సార్ సీపీ చీఫ్ విప్ మార్గా ని భరత్ రామ్ అభినందనలు తెలిపారు. రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు మారం బాల బ్రహ్మా రెడ్డి నుండి వచ్చిన ఉత్తర్వులతో రాజా రెడ్డి ఎంపీ ని కలిశారు. ఈ సందర్భంగా హరిత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంపీ భరత్ రామ్ కండ్రపు రాజారెడ్డి ని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు. క్రీడల అభివృద్ధికి కృషి చెయ్యాలని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు. మరిన్ని పదవులు సాధించి క్రీడల అభివృద్ధికి కార్యాచరణతో కృషి చెయ్యాలని ప్రోత్సాహం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *