జగన్ రాజధాని పై మాట తప్పారు కనుక ప్రజా తీర్పు కోరాలి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

 

జగన్ రాజధాని పై మాట తప్పారు కనుక ప్రజా తీర్పు కోరాలి

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

★ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తను తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామోదం ఉందని భావిస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించాలి

★ వైకాపా నాయకులు మాట్లాడితే తమ నాయకుడు మాట తప్పరు మడం తిప్పరని అంటుంటారు ఆయితే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి  అమరావతి లొ రాజధాని ఏర్పాటును సమర్ధించి నేడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాజధానిని అమరావతి నుండి మార్చడము మాట తప్పడము కాదా, మడమ తిప్పడం కాదా

★ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుండి మారుస్తారని తెలుగుదేశం పార్టీ దృష్ప్రచారం చేస్తుందని తమ పార్టీ అధికారం లోకి వస్తే రాజధానిని మార్చే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రచారం లో చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏమి చెప్తారు

★ ప్రధాని మంత్రి చేత శంకుస్థాపన చేసి ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయలతో అనేక భవనాలు నిర్మించిన తరుణంలో రాజధాని మార్చాల్సిన అవసరం ఏమి వచ్చింది

★ ఎన్నికల సమయంలో మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఓట్లు అడగలేదు కనుక ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డితన మూడు రాజధానుల నిర్ణయం పై ప్రజాఆమోదం తీసుకోవాలి

★ వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి  మొండిగా వ్యవహరించడం దురదృష్టకరం

★ ముఖ్యమంత్రి నిజంగా తను తీసుకొన్న నిర్ణయానికి ప్రజా ఆమోదం ఉందని భావిస్తే వెంటనే శ్రీ చంద్రబాబు నాయుడు  సవాలును స్వీకరించి అసంబ్లీని రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలి లేదంటే అమరావతి లొనే రాజధానిని కొనసాగించాలి

ఇట్లు
చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *